ఏడునూతులలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణోత్సవం


- ఏడునూతులలో వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు


ఏడునూతుల , శ్రీరామనవమిని పురస్కరించుకొని కొడకండ్ల  మండలం ఏడునూతుల  గ్రామంలోని  శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలోని నూతన కళ్యాణ మండపంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవానికి




గూడ యామిని హైద్రాబాద్ వారు స్వామి వారలకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. పలు రకాల పుష్పాలతో సీతమ్మను, శ్రీరామచంద్రుడిని అందంగా అలంకరించారు.ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు , కల్యాణ వేదికపై గుడి పూజారి తోమాల శ్రీనివాస స్వామి 12 గంటల సమయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని సంప్రదాయ రీతిలో వేదమంత్రో చ్ఛరణల నడుమ అంగరంగ వైభవంగా హైందవ ఉత్సవ సమితి స్థాపకుడు పెనగోండ యాకెందర్ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు .   వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించారు. మంగళ వాయిద్యాలు, వేద పారాయణంతో ఉత్సవమూర్తుల ను కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని కన్నులార తిలకించారు.













Post a Comment

Previous Post Next Post