ధనుర్మాసం
అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి
మర్ఘశిరమాసం వచ్చింది దనుర్మాసం కూడా మొదలు కాబోతుంది. ఎంతో విశేషమైన
రోజులు. ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు
బదులుగా గోదాదేవి పాడిన ౩౦ పాశురాలును పాడతారు ఇది చాలా విశేషమైననెల.
అంత
విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ
నెలరోజులు ఇంటి
ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు .
ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజులు రోజుకు ఒక పాశురమ్
చదువుతారు . ఇలా 30 రోజులు పాశురములు నివేదిస్తారు.