Andal (Goda Devi) Kalyanam IN EDUNUTHULA KODAKANDLA WARANGAL TELANGANA

గోదాదేవి ఎవరు.?
నామాంతరములు - కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, ఆముక్త మాల్యద
జన్మస్థలం - శ్రీరంగం
జన్మ నక్షత్రము - నల సంవత్సరం, కర్కాట మాసము, పుబ్బా నక్షత్రము, ఆషాఢ శుద్ధ చతుర్దశి, కాలము క్రీ.శ.776
దైవాంశ - లక్ష్మి
రచనలు - తిరుప్పావు, నాచ్చియార్ తిరుమొళి
గోదా చరితం
గోదా దేవి విష్ణుచిత్తుల పెంపుడు కుమారి. ఆమె ప్రతి దినమూ రంగనాథునికి తను ధారణ చేసిన మాలలను మధుర భక్తితో సమర్పించినది. తన అనన్య ఆరాధనా బలిమితో ఆమె చివరికి ఆ జగన్నాధుని తన నాథునిగా పొంది జన్మను చరితార్థం చేసుకున్నది.

ఆండాళ్ లేదా గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సు వచ్చిన తరువాత గోదాదేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలధారణ కావించడం మానుకున్నారు. దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని తలచి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తుని ఓదార్చారట. అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలనే తెచ్చి వేయాలని స్వామి ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు ఆపై అలాగే చేస్తారు.
తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావు" వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది, వివాహానంతరం గోదాదేవి ఆ జగదాధికారిలో, చిద్విలాసునిలో లీనమవుతుంది, అది చూసి విష్ణుచిత్తులవారు మహా దుఃఖితులవుతారు. ఆ తరుణంలో స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి ఇహ మాయ నుండి వెలుపలకి తీసుకు వచ్చి ఉద్ధరిస్తారు. గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది. దీనిని ధనుర్మాసం లో ప్రతిరోజూ, విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాశురం చొప్పున పఠిస్తారు. ఈ ప్రతి పాశురమూ మహిమాన్వితమైనవి.























Previous Post Next Post

نموذج الاتصال